బస్సు ఎక్కాలంటే భయపడుతున్న మగ జాతి : ఒళ్లంత డబ్బాలతో మహిళలకు షాక్

బస్సు ఎక్కాలంటే భయపడుతున్న మగ జాతి : ఒళ్లంత డబ్బాలతో మహిళలకు షాక్

కేరళ కోజికోడ్ లో దీపక్ ఆత్మహత్య తర్వాత కేరళ మగ జాతి టిట్ ఫర్ ట్యాట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. బస్సులు ఎక్కాలంటే భయపడటం కాదు.. ముందూ వెనకా ఆడోళ్లు ఉన్నారా లేదా అని చూసుకుని మరీ బస్సులు ఎక్కుతున్నారు. ఈ క్రమంలోనే కేరళలోని ఓ వ్యక్తి.. ఒళ్లంతా డబ్బాలు చుట్టుకుని.. బస్సు ఎక్కిన వీడియో వైరల్ అయ్యింది. బస్సులో ఆడోళ్లు లేరు కదా.. హమ్మయ్య బతికిపోయాం అంటూ అతను కామెంట్ చేయటం ఫన్నీగానే కాదు.. కేరళలో ఇప్పుడు మగ జాతి జాగ్రత్తలు ఎలా ఉన్నాయో స్పష్టం చేస్తుంది.

యువతి వీడియో  కారణంగానే   దీపక్  ఆత్మహత్య చేసుకున్నాడని సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది.  ఈ ఘటన తర్వాత  ఆర్టీసీ  బస్సుల్లో ప్రయాణిస్తున్న  చాలా మంది  వీడియోలు తీసి  పోస్ట్ చేస్తున్నారు.  లేటెస్ట్ గా కేరళ ఘటనపై  సోషల్ మీడియాలో ఓ  వీడియో చాలా వైరల్ అవుతోంది.    ప్రయాణీకులకు టిక్కెట్లు జారీ చేస్తున్నప్పుడు ఒక బస్సు కండక్టర్ ఒళ్లంతా  కప్పుతూ డబ్బాలు కట్టుకున్నాడు. మాకు  పురుషుల కమిషన్  కావాలి అంటూ బోర్డు మెడలో వేసుకున్నాడు.   బస్సులో  మహిళలు లేరు కదా హమ్మయ్య బతికిపోయాం.. అని కామెంట్ చేయడం వైరల్ అవుతోంది.    

కేరళ కోజికోడ్‌లోని బస్సులో  దీపక్ (42) అనే వ్యక్తి ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణించాడు. జర్నీ టైమ్‎లో బస్సులో దీపక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువతి వీడియో తీసి జనవరి 16న సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‎గా మారడంతో దీపక్‎పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తాను అటువంటి వాడిని కాదని.. అవమానభారం భరించలేక దీపక్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానస్పద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  ప్రస్తుతం వీడియో తీసి పోస్ట్ చేసిన యువత పరారీలో ఉంది. పోలీసులు ఆమెను పట్టుకునే పనిలో ఉన్నారు.