అన్ని అబద్దాలు.. నిజం కాదు..:మోదీ పుతిన్‌కు ఫోన్ చేయలేదు.. నాటో చీఫ్ మాటల్ని కొట్టిపారేసిన భారత ప్రభుత్వం..

 అన్ని అబద్దాలు.. నిజం కాదు..:మోదీ పుతిన్‌కు ఫోన్ చేయలేదు.. నాటో చీఫ్ మాటల్ని కొట్టిపారేసిన భారత ప్రభుత్వం..

అమెరికా విధించిన పన్నుల (tariffs) నిర్ణయం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేశారని నాటో (NATO) చీఫ్ మార్క్ రుట్టే ఇటీవల చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గట్టిగా ఖండించింది. అదంతా పూర్తిగా తప్పు, నిజం కాదు అని MEA  తెలిపింది.

MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ పుతిన్‌తో మీరు చెప్పినట్టు ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటి ఫోన్ సంభాషణ జరగలేదు. నాటో వంటి ముఖ్యమైన నాయకులు ప్రజల్లో మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతగా, కచ్చితంగా  ఉండలని కోరుకుంటున్నాము. ప్రధాని వ్యవహారాలను తప్పుగా చెప్పడం లేదా జరగని విషయాల గురించి మాట్లాడటం సరికాదు అని అన్నారు. 

ఇంతకుముందు నాటో చీఫ్ మార్క్ రుట్టే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన భారీ సుంకాల నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. ఈ చర్యలు ఉక్రెయిన్ యుద్ధంపై ప్రభావం చూపాయని కూడా అన్నారు.

ట్రంప్ పన్నులు వేసిన వెంటనే ప్రధాని మోదీ పుతిన్‌కు ఫోన్ చేసి, ఉక్రెయిన్ విషయంలో రష్యా ప్లాన్ ఏంటో  అడిగారని రుట్టే చెప్పారు. ఐక్యరాజ్యసమితి సమావేశం సందర్భంగా ట్రంప్ గతంలో మాట ఇచ్చి కూడా వెనక్కి తగ్గిన సందర్భాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారైనా  నిజంగా ఆంక్షలు విధిస్తారా అంటూ రుట్టేని  ప్రశ్నించారు. 

దీనికి బదులుగా రుట్టే మాట్లాడుతూ ట్రంప్ ఇప్పటికే ఆ పని చేశారు. పెద్ద సుంకాలు కాకపోయినా భారత్‌పై పెద్ద పన్నులు వేశారు. ఇది వెంటనే రష్యాను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. నేను మీకు మద్దతిస్తున్నాను, కానీ ఇప్పుడు నేను అమెరికా విధించిన 50% సుంకాల సమస్యలో పడ్డాను. కాబట్టి నాకు ఈ ప్లాన్  వివరించగలరా ? అని అడుగుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పింది అమలు చేస్తున్నారు. యుద్ధాన్ని ఆపడంలో విజయవంతం కానందుకు సంతోషంగా లేదు, కానీ  ట్రంప్ ఆ విషయంలో కృషి చేస్తున్నారు అని అన్నారు.