సెల్ ఫోన్​లో ఆక్సిజన్ లెవల్స్ ..40 సెకన్లలోనే రిజల్ట్

సెల్ ఫోన్​లో ఆక్సిజన్ లెవల్స్ ..40 సెకన్లలోనే రిజల్ట్

కోల్ కతా:  దవాఖానకు పోవాల్సిన పనిలేదు. పల్స్ ఆక్సీ మీటర్లు, స్మార్ట్ వాచ్​లూ అక్కర్లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఇంటిదగ్గరే మన హార్ట్ బీట్, బీపీ, ఆక్సిజన్ లెవల్స్, రెస్పిరేటరీ రేట్​ను ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ‘కేర్ ప్లిక్స్ వైటల్స్’ అనే యాప్ ను తయారు చేసింది కోల్ కతాకు చెందిన ‘కేర్ నౌ హెల్త్ కేర్’ అనే స్టార్టప్ కంపెనీ. ఈ యాప్ తో 40 సెకన్లలోనే 96 శాతం కచ్చితంగా రిజల్ట్ తెలిసిపోతుందని ఆ కంపెనీ చెప్తోంది. 

యాప్ ఇట్ల పని చేస్తది.. 

ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ఫొటో ప్లెథిస్మోగ్రఫీ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. పల్స్ ఆక్సీ మీటర్లలో ఇన్ఫ్రారెడ్ లైట్ సెన్సార్లు ఉంటాయి. కానీ ఈ యాప్​లో స్మార్ట్ ఫోన్ లోని ఫ్లాష్​లైట్ ద్వారా ఆక్సిజన్ లెవల్స్ ను తెలుసుకోవచ్చు. ఫ్లాష్​లైట్ ఆన్ చేసి, మన వేలిని బ్యాక్ కెమెరా ముందు ఉంచి, స్కాన్ బటన్ నొక్కితే చాలు.. 40 సెకన్లలోనే రిజల్ట్ వచ్చేస్తది. ప్రస్తుతం ఐఫోన్ యూజర్లకే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలో ప్లే స్టోర్ లో రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.