చైనాలో వాడిన వాక్సిన్లు తక్కువ క్వాలిటీవి : డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి

చైనాలో వాడిన వాక్సిన్లు తక్కువ క్వాలిటీవి : డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి

చైనా పరిస్థితి మన దేశంలో ఉండదని ఏఐజీ  ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. చైనాలో సరిగా వాక్సినేషన్ జరగలేదని.. అక్కడ వాడిన వాక్సిన్లు చాలా తక్కువ క్వాలిటీవని చెప్పారు. కోవిడ్లో చాలా రకాల మ్యుటేషన్లు వచ్చాయని.. ఎక్స్ బీబీ వైరస్  ఇండియాలోకి ఎంటరవుతుందని తెలిపారు. ప్రస్తుతం నమోదవుతోన్న 80శాతం  కోవిడ్ కేసులకు ఎక్స్ బీబీ రకమే కారణమన్నారు. బీఎఫ్ 7 మ్యుటేషన్ కూడా అక్టోబర్ లోనే  భారత్ లోకి వచ్చినట్లు తెలిపారు.

బీఎఫ్ 7 చాలా వేగంగా వ్యాపిస్తుందని.. అయితే డెల్టా అంత ప్రమాదకరంకాదని నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. మన దేశంలో బూస్టర్ తీసుకోని వారి సంఖ్య అధికంగా ఉందని.. కేవలం 28శాతం మంది మాత్రమే బూస్టర్ డోస్ తీసుకున్నారని తెలిపారు. క్రాస్ వాక్సినేషన్తోనే మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. పెళ్లిళ్లు, పండగల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు కోవిడ్ రూల్స్ పాటించాలని సూచించారు. 60ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు.