మళ్లీ కార్లు కొంటున్నరు

మళ్లీ కార్లు కొంటున్నరు

మారుతీ సుజుకి శశాంక్ శ్రీవాస్తవ
కరోనా వల్ల పర్సనల్ మొబిలిటీకే మొగ్గు
వెహికల్ ఎక్స్ఛేంజ్‌ తగ్గింది

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కు బదులు ప్రజలు ఎక్కువగా పర్సనల్ మొబిలిటీని వాడుతుండటంతో.. తొలిసారి వెహికల్ కొనేవాళ్ల సంఖ్య పెరిగిందని, అంతేకాకుండా, ఇప్పటికే ఒక కారున్న వాళ్లు ఇప్పుడు మరో కారు కొంటున్నారని మారుతీ సుజుకి ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్(సేల్స్, మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ కారణంతోనే జులైలో వెహికల్ సేల్స్ కాస్త మెరుగయ్యాయని పేర్కొన్నారు. అయితే ఫెస్టివ్ సీజన్ అమ్మకాలు కరోనా సంక్షోభంపైనే ఆధారపడ్డాయని కంపెనీ చెబుతోంది. లాంగ్ టర్మ్ వెహికల్ డిమాండ్ కూడా ఎకానమీలో చాలా ఫండమెంటల్స్‌పై ఆధారపడి ఉన్నట్టు పేర్కొంది. ‘తొలిసారి కారు కొనుగోళ్లు పెరిగాయి.రీప్లేస్‌‌మెంట్ బయ్యింగ్ అంటే ఎక్స్చేంజ్ తగ్గింది. అడిషినల్ కారు కొనుగోళ్లు కూడా పుంజుకున్నాయి’ అని శ్రీవాస్తవ తెలిపారు. దీనికి గల కారణం ప్రజలు ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కు బదులు పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్ వాడుతున్నట్టు చెప్పారు. తొలిసారి వెహికల్ కొనుగోళ్ల షేరు 2019–20 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌‌తో పోలిస్తే.. ఈక్వార్టర్‌‌లో 5.5 శాతం పెరిగి సుమారు 51–53 శాతానికి చేరుకున్నట్టు పేర్కొన్నారు. కరోనా వల్ల వెహికల్ ఎంక్వైరీ లెవల్స్ కూడా 85–90 శాతానికి చేరుకున్నట్టు చెప్పారు. మినీ, కాంపాక్ట్‌ సెగ్మెంట్స్ ఎంక్వైరీలు అత్యధిక షేరుతో సుమారు 65 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అంతకుముందు ఇవి 55 శాతంగానే ఉండేవి. కంపెనీ మొత్తం డొమెస్టిక్ ప్యాసెంజర్ వెహికల్ సేల్స్ జులైలో 1.3 శాతం పెరిగి 97,768 యూనిట్లుగా ఉన్నాయి. ఇవి గతేడాది జులైలో 96,478యూనిట్లుగానే రికార్డయ్యాయి. జూలై సేల్స్ డేటాను చూసుకుంటే ఆటోమార్కెట్ రికవరీ అవుతున్నట్టు తెలుస్తోందని శ్రీవాస్తవ తెలిపారు. ప్రొడక్షన్, సప్లై చెయిన్స్ సాధారణ పరిస్థితులు వచ్చేశాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో లాక్‌‌డౌన్‌ ‌వారం ఉంటే, కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజులేనని.. అలా ప్రాంతాన్ని బట్టి లాక్‌‌డౌన్ నిబంధనలు ఉన్నాయని చెప్పారు. మొత్తంగా తమకు3,080 అవుట్‌ ‌లెట్లు ఉన్నాయని వాటిలో2,800కు పైగా అవుట్‌‌లెట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. ఫెస్టివ్ సీజన్‌‌లో ప్రతేడాది కాస్త పాజిటివ్ సెంటిమెంట్ ఉంటుందని, కానీ ఈసారి కరోనా వల్ల పరిస్థితులను కేర్‌‌ఫుల్‌‌గా వాచ్ చేయాల్సి ఉందన్నారు. కరోనా వైరస్ విషయంలో ఏమైనా పాజిటివ్ డెవలప్‌మెంట్ ఉంటే, ఫెస్టివ్ సీజన్ కచ్చితంగా మంచిగా ఉంటుందని శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఒకవేళ కరోనా విషయంలో నెగిటివ్‌ ‌పరిస్థితులు కనుక తల్తెతితే.. మరోసారి లాక్‌‌డౌన్‌‌లు విధిస్తే ఫెస్టివ్ సీజన్‌ ‌సేల్స్ నెగిటివ్‌‌గా ఉండనున్నాయని శ్రీవాస్తవ అభిప్రాయం వ్యక్తం చేశారు.

రిటైల్ అవుట్ లెట్లు ప్రభావం చూపుతాయి
‘మున్ముందు పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలిస్తాం. లాంగ్ టర్మ్ డిమాండ్ ఎకానమీలో ఫండ్‌‌మెంటల్స్ ప్రకారం ఉంటుంది. లోకల్ లాక్‌డౌన్‌లను మేము పరిశీలిస్తున్నాం. ఎందుకంటే ఇవి డీలర్ స్థాయి నుంచి కన్జూమర్ లెవల్ వరకున్న రిటైల్ మూమెంట్‌కు అంతరాయం కల్గించనున్నాయి. లోకల్ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లు కంపెనీ రిటైల్ అవుట్‌లెట్ల పనితీరుపై ప్రభావం చూపనున్నాయి.
– శశాంక్ శ్రీవాస్తవ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

For More News..

అయోధ్యకు ఆధ్యాత్మిక శోభ

తమిళనాడులో మత్స్యకారుడి హత్య.. 20 పడవలకు నిప్పు

పనిచేయని ఎమ్మెల్యేలకు జీతాలెందుకు?