2024లో వస్తున్న 5 కార్లు.. ఫీచర్లు, పనితీరులో నెంబర్ వన్

2024లో వస్తున్న 5 కార్లు.. ఫీచర్లు, పనితీరులో నెంబర్ వన్

మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్తో సహా భారతదేశంలోని అనేక కంపెనీలు 2024లో కొత్త కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వీటిలో పెట్రోల్, డీజిల్ కార్లతోపాటు ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. ఈ ఏడాది విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న 5 కార్ల గురించి తెలుసుకుందాం. 

మారుతి సుజుకీ EVX కాన్సెప్ట్ 

ఈ ఎలక్ట్రిక్ SUV2024  పండగ సీజన్ లో వస్తుంది. ఇది టయోటా 27PL స్కేట్ బోర్ట్ ఫ్లాట్ ఫారమ్ లో రూపొందించబడుతుంది. మారుతి సుజుకి తన మొదటి EV లో ADAS టెక్నాలజీ, ఫ్రేమ్ లెస్ రియర్ వ్యూ మిర్రర్, 360 డిగ్రీ కెమెరా వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయని ఇప్పటికే ధృవీకరించింది. 

2024 మారుతి స్విఫ్ట్ 

ఇది ప్రముఖ హ్యాచ్ బ్యాక్. ఇది కొత్త ఫేస్ లిఫ్ట్ తో వస్తోంది. ఇది కొత్త డిజైన, ఇంటీరియర్, టెక్నాలజీతో రానుంది. 1.2 లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్  అమర్చబడి ఉంటుంది. మంచి మైలేజ్, పనితీరును కనబరుస్తుంది. కొత్త తరం స్విఫ్ట్ ను రూ. 6 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో విడుదల అవుతుంది. కంపెనీ దీనిని మార్చి 2024 నాటికి లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. 

టాటా కర్వ్ 

టాటా కర్వ్ అనేది కూపే డిజైన్ SUV .ఇది కంపెనీ మొదటి కూపే SUV. Rdr 2024 జూన్ తర్వాత భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 

హ్యుందాయ్ క్రెటా EV

హ్యుందాయ్ క్రెటా ఆధారిత ఎలక్ట్రిక్ SUV 2024 ఎండింగ్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు డిజైన్, స్టైల్ అప్ డేట్ చేయబడిన క్రెటా లాగా ఉంటాయి. ఇది LG కెమికల్ నుంచి పొందిన 45kWh బ్యాటరీ ప్యాక్ తో అందించబడుతోంది.

మహీంద్రా థార్ 5డోర్

ఇది ఆఫ్ రోడ్ SUV. థార్ 5 డోర్ వెర్షన్. మరింత ప్లేస్ తో సౌకర్యంగా ఉంటుంది. రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. 2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్. దీని అంచనా ధర రూ. 15 లక్షలు, దీనిని 2024 మార్చిలో ప్రారంభించవచ్చు.