హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కాస్కేడ్స్ నియోపోలిస్.. రూ. 3,169 కోట్ల పెట్టుబడి.. 63 అంతస్తుల నిర్మాణం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కాస్కేడ్స్ నియోపోలిస్.. రూ. 3,169 కోట్ల పెట్టుబడి.. 63 అంతస్తుల నిర్మాణం

హైదరాబాద్, వెలుగు:  జీహెచ్ఆర్  ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రా , లక్ష్మీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రా,  అర్బన్‌‌‌‌‌‌‌‌బ్లాక్స్ రియాలిటీ ప్రమోటర్ల ఉమ్మడి భాగస్వామ్య సంస్థ జీహెచ్ఆర్  లక్ష్మీ అర్బన్‌‌‌‌‌‌‌‌బ్లాక్స్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రా "ది కాస్కేడ్స్ నియోపోలిస్" పేరిట లగ్జరీ రెసిడెన్షియల్​ప్రాజెక్టును ప్రారంభించింది. హైదరాబాద్​లోని కోకాపేటలో నిర్మించే ఈ ప్రాజెక్టు కోసం రూ. 3,169 కోట్లు పెట్టుబడి పెడతారు. ఇందులో దాదాపు 217 మీటర్ల ఎత్తుతో ఐదు 63 అంతస్తుల టవర్లు ఉంటాయి.  

2030 మార్చి నాటికి కొనుగోలుదారులకు అప్పగిస్తారు. ఈ ప్రాజెక్ట్ 7.34 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఇందులో 1,189 మూడు, నాలుగు బెడ్​రూమ్​ల అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు ఉంటాయి. ఇవి 2,560 చదరపు అడుగుల నుంచి 4,825 చదరపు అడుగుల వరకు విస్తరించి ఉంటాయి.

 వీటితో పాటు 54వ అంతస్తులో 10 ప్రత్యేకమైన ట్రిపుల్ పెంట్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లను నిర్మిస్తారు.     స్కై గార్డెన్, ప్యాడిల్ టెన్నిస్, పికిల్ బాల్ కోర్ట్,  యోగా డెక్, ఔట్ డోర్ జిమ్, రెండు హెలిప్యాడ్స్​ వంటి ప్రత్యేకతలు ఈ ప్రాజెక్టు సొంతం.