పెండ్లి చేసుకుంటానంటూ కానిస్టేబుల్​పై రెండేండ్లుగా ఎస్సై అత్యాచారం

పెండ్లి చేసుకుంటానంటూ కానిస్టేబుల్​పై రెండేండ్లుగా ఎస్సై అత్యాచారం
  • మహారాష్ట్ర నవీ ముంబైలో కేసు నమోదు

థానే: పెండ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఓ మహిళా కానిస్టేబుల్​పై రెండేండ్లుగా అత్యాచారానికి పాల్పడిన ఎస్సైపై రేప్​ కేసు నమోదు అయింది. మహారాష్ట్రలోని నవీ ముంబై టౌన్​ షిప్​లో ఓ సబ్ ఇన్​స్పెక్టర్​(32)  పెళ్లయిన ఓ మహిళా కానిస్టేబుల్​(26)ను  పెండ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసు లు తెలిపారు. 2020– 2022 జులై వరకు సాన్​పద ఏరియాలో ఓ ఫ్లాట్ కిరాయికి తీసుకొని పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు.

 భర్తను విడిచి పెట్టాలని.. లేదంటే అతన్ని చంపేస్తానని ఆమెను బెదిరించాడని తెలిపారు. ఇదే టైమ్​లో ఆమె నుంచి రూ.19 లక్షల తీసుకొని అందులో రూ.14 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చాడని అన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శనివారం నవీ ముంబై టౌన్ షిప్​ స్టేషన్​లో జీరో ఎఫ్​ఐఆర్ నమోదు చేసి.. ఎంక్వైరీ కోసం సంపాడు స్టేషన్​కు ట్రాన్స్​ఫర్ చేసినట్లు వివరించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్​ 376 (రేప్), 354 (ఏ) (లైంగిక వేధింపులు)  కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు.