బర్త్ డే పార్టీలో పాల్గొన్న యువతులపై కేసు

V6 Velugu Posted on Jun 13, 2021

రంగారెడ్డి : కరోనా రూల్స్ బ్రేక్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా.. ఎక్కడో చోట లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. మ్యారేజెస్, బర్త్ డే అంటూ మాస్కులు లేకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా కేక్ కట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో జన్మదిన వేడుకలు జరుపుకున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లోని బాక్స్‌ ఫామ్‌ హౌజ్‌ లో వరుణ్‌ గౌడ్‌ అనే వ్యక్తి జన్మదిన వేడుకలను శనివారం అర్థరాత్రి ఘనంగా నిర్వహించారు. పార్టీపై సమాచారం అందుకున్న కడ్తాల్‌ పోలీసులు ఎస్‌వోటీ సిబ్బందితో వెళ్లి ఫామ్‌ హౌజ్‌ పై రైడ్‌ చేశారు. మొత్తం  68 మంది పార్టీ నిర్వాహకులను, పాల్గొన్నవారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 21 మంది యువతులు ఉన్నట్లు సమాచారం. వీరందరినీ స్టేషన్‌ కు తరలించి కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలం నుండి పెద్దఎత్తున మద్యం సీసాలు, సౌండ్‌ సిస్టమ్‌ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది పరారీలో ఉన్నారని తెలిపారు పోలీసులు.
 

Tagged Hyderabad, case, lockdown, corona, Birthday party, young women,

Latest Videos

Subscribe Now

More News