విజయ్ ప్రచార రథాన్ని నడిపిన డ్రైవర్పై కేసు

విజయ్ ప్రచార రథాన్ని నడిపిన డ్రైవర్పై  కేసు

కరూర్: తమిళగ వెట్రికజగం(టీవీకే) చీఫ్ విజయ్ ప్రచార రథాన్ని నడిపిన డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కరూర్ తొక్కిసలాటకు సంబంధించి బస్సు డ్రైవర్ ప్రమేయంకూడా ఉందని ఆరోపణలు వెలువెత్తడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ప్రచార రథాన్ని కూడా సీజ్ చేశారు. కరూర్ లో హీరో విజయ్ ర్యాలీని చేపట్టినప్పుడు భారీ సంఖ్యలో అభిమానులు ప్రచార రథానికి దగ్గరగా వచ్చారు. 

అతడిని చూసేందుకు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టులో ఇటీవల విచారణ జరిగింది. విజయ్ ప్రచార రథం ప్రమాదంలో చిక్కుకుందని తమకు సమర్పించిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తుందని హైకోర్టు తెలిపింది. రెండు మోటార్ సైకిళ్లు కూడా ప్రమాదంలో చిక్కుకున్నాయని.. బస్సు డ్రైవర్ స్పాట్ నుంచి పారిపోయారని చెప్పింది.