హుస్నాబాద్, వెలుగు: కానిస్టేబుల్విధులకు ఆటంకం కలిగించి దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఓ కానిస్టేబుల్ తన విధులను నిర్వర్తిస్తుండగా గద్దల కన్నయ్య అనే వ్యక్తి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. ప్రభుత్వ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
