
ఆర్ఎక్స్ 100 మూవీ ఫేం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదైంది. పెద్దపల్లిలో జులై 11 న షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొంది. షాపింగ్ మాల్ లో రిబ్బన్ కట్ చేసింది. దీపం వెలిగించి పూజలు చేసింది. ఫోటోలకు పోజులిచ్చింది. అయితే ఇవన్నీ చేసేటప్పుడు ఆమె మాస్క్ పెట్టుకోలేదు. దీంతో కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందని పాయల్ రాజ్ పుత్ పై పెద్దపల్లి పట్టణానికి చెందిన బాబ్జి అనే వ్యక్తి పెద్దపల్లి జూనియర్స్ విల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో కోర్టు ఆదేశాలతో పోలీసులు పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు చేశారు. హీరోయిన్ తో పాటు షాపింగ్ మాల్ యజమాని అతని భార్యపై కేసు నమోదు చేశారు.