ఎంపీ బండి సంజయ్పై కేసు

ఎంపీ బండి సంజయ్పై కేసు
  • చెంగిచెర్లలో పోలీసు విధులకు ఆటంకం
  • తనపై దాడిశారని నాచారం సీఐ కంప్లైంట్
  • మేడిపల్లి పీఎస్ లో కేసు ఫైల్

హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పై మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. బోడుప్పల్ సమీపంలోని చెంగిచెర్లలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై ఎఫ్ఐఆర్​ఫైల్​అయ్యింది.  తనపై దాడిచేశారని నాచారం సీఐ నందీశ్వర్​రెడ్డి ఫిర్యాదు మేరకు బండిసంజయ్, ఘట్​కేసర్​ఎంపీపీ సుదర్శన్​తో పాటు మరో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా హోలీ పండుగ రోజు రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకు బండి సంజయ్ నిన్న చెంగిచెర్లకు వెళ్లిన సంగతి తెలిసిందే.

రాజాసింగ్ హౌస్ అరెస్ట్
చెంగిచెర్లకు వెళ్లకుండా గృహనిర్బంధం

హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ సాయంత్రం చెంగిచెర్లకు వెళ్తానని రాజాసింగ్‌ ప్రకటించడంతో ముందస్తుగా ఆయన్ను గృహ నిర్బంధంలో పెట్టారు. అయితే దీనిపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనను ఎన్ని రోజులు ఇలా హౌస్ అరెస్ట్ చేసి నన్ను నిలువరిస్తారు అంటూ ఫైర్​అయ్యారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తే భయమెందుకని పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కేసీఆర్ ఏడో నిజాంలా పరిపాలించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. పరిపాలనలో కేసీఆర్, రేవంత్ కి మధ్య పెద్ద తేడా ఏమీ కనపడటం లేదని విమర్శించారు.