సాగర్ రగడ : ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసులు

సాగర్ రగడ : ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసులు

నాగార్జున సాగర్ వివాదంలో కీలకపరిణామం చోటు చేసుకుంది. ఏపీ పోలీసులపై  నాగార్జునసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.   తెలంగాణ ఎస్పీఎఫ్‌  పోలీసుల ఫిర్యాదు మేరకు   విజయపురి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  పోలీసులతో పాటుగా  ఆ రాష్ట్ర ఇరిగేషన్‌ అధికారులపై  తెలంగాణ ఎస్పీఎఫ్‌  పోలీసులు పెట్టారు.   అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని, అనుమతి లేకుండా ఏపీ పోలీసులు  డ్యామ్‌పైకి వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారంటూ  ఫిర్యాదులో పేర్కొన్నారు.  

నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర రెండోరోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ముళ్లకంచెల మధ్య సాగర్ డ్యాంపై రెండు తెలుగురాష్ట్రాల పోలీసుల పహారా కంటిన్యూ అవుతోంది.  సాగర్ ప్రాజెక్ట్ పై ఏపీ వైపు, తెలంగాణ వైపు  భారీగా పోలీసులు మోహరించారు.  నిన్న మధ్యాహ్నం దౌర్జన్యంగా కుడి కాల్వకు నీటిని విడుదల చేసుకున్నారు  ఏపీ అదికారులు. 

నాగార్జునసాగర్ ప్రాజెక్టు దగ్గర పరిస్థితులపై అరా తీస్తున్నాయి తెలంగాణ,ఏపీ ప్రభుత్వాలు.  ఏపీ పోలీసుల దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్స్,  ధ్వంసం చేసిన సీసీ కెమెరాలు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు స్మితా సబర్వాల్. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలు ఏపీ ప్రభుత్వం పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు పరిస్థితిని అంచనా వేసే అవకాశముంది.