కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు..

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు..

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై కేసు నమోదైంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 17 ఏళ్ల మైనర్ బాలిక, ఆమె తల్లి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు పోక్సోచట్టం, ఐపీసీ సెక్షన్ 354(ఏ) కింద యడియూరప్పపై కేసు నమోదు చేశారు. 

ఫిబ్రవరి 2న ఓ చీటింగ్ కేసుకు సంబంధించి సాయం కోసం వెళితే ఇలా జరిగిందని బాధిత బాలిక, ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.