మంచిర్యాల జిల్లాలో రూ.7.60 కోట్ల సీఎంఆర్ రైస్ ఎగవేత..

మంచిర్యాల జిల్లాలో రూ.7.60 కోట్ల సీఎంఆర్ రైస్ ఎగవేత..
  • అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్లు యజమానిపై కేసు

దండేపల్లి, వెలుగు: ప్రభుత్వానికి అందించాల్సిన సీఎంఆర్ ​బియ్యాన్ని దారి మల్లించి భారీగా సొమ్ము చేసుకున్న రైస్ మిల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పెద్దపేటలో ని ఎంఎస్ వెంకటరమణ రైస్ మిల్లు యజమాని జాడి లక్ష్మిపై జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ శ్రీకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తహసీనోద్దిన్ తెలిపారు. ప్రభుత్వానికి వివిధ సీజన్లలో సీఎంఆర్ ధాన్యాన్ని ఎగ్గొట్టినట్లు తేలిందన్నారు. 

2023-24 సీజన్​లో3086 మెట్రిక్​టన్నులు వడ్లు తీసుకొని ప్రభుత్వానికి కేవలం1065 మెట్రిక్​టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు. మిల్లులో జరిగిన అక్రమాలపై అందిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు జాడి లక్ష్మిపై కేసు నమోదు చేశారు. 23-24, 2024-25 సీజన్లలో రూ.7.60 కోట్ల సీఎంఆర్​బకాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.