గద్వాలలో నగదు, మద్యం సీజ్

గద్వాలలో నగదు, మద్యం సీజ్

గద్వాల, వెలుగు: వెహికల్స్  తనిఖీల్లో భాగంగా మంగళవారం రూ.11,52,200 నగదును సీజ్  చేసినట్లు ఎస్పీ రితిరాజ్​ తెలిపారు. ఉండవెల్లి మండలం పుల్లూరు చెక్ పోస్ట్  దగ్గర రూ.11 లక్షలు, కేటిదొడ్డి మండలం నందిన్నె చెక్ పోస్ట్  దగ్గర రూ.54,200 పట్టుబడ్డాయని చెప్పారు. నగదుకు సంబంధించిన రసీదులు చూపించకపోవడంతో సీజ్  చేసినట్లు ఎస్పీ తెలిపారు.
 

నవాబుపేట: మండల కేంద్రం సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో లోకిరేవు గ్రామానికి చెందిన దుబ్బసత్తయ్య  తరలిస్తున్న 4.7 లీటర్ల లిక్కర్​తో పాటు కొల్లూరు గ్రామానికి చెందిన షాబాద్​ మల్లేశ్​ తీసుకెళ్తున్న రూ.63 వేలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ అభిషేక్​రెడ్డి తెలిపారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో  సీజ్​ చేసినట్లు చెప్పారు.