ఏపీలో మొదలైందా : గూడూరులో రూ. 5 కోట్ల డబ్బు పట్టివేత

ఏపీలో మొదలైందా : గూడూరులో రూ. 5 కోట్ల డబ్బు పట్టివేత

ఉమ్మడి నెల్లూరు జిల్లా పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌( Andhra Pradesh) లో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వాహనాల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. . మద్యం(Liquor), నగదు(Cash) అక్రమంగా తరలించే అవకాశం ఉండడంతో పోలీసులు టోల్‌ప్లాజాలతో పాటు శివారు ప్రాంతాల్లో , పోలీసులు పికెటింగ్‌లను ఏర్పాటు చేశారు.

మరో రెండు, మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్​ లో  ఎన్నికల జరుగుతన్న నేపథ్యంలో  ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు  పోలీసులు  తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఓ వాహనంలో తరలిస్తున్న  5 కోట్ల 12 లక్షల 91 వేల రూపాయిలను స్వాధీనం చేసేకొని ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చిల్లకూరు, గూడూరు రూరల్, టౌన్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు  మూడు బృందాలను పట్టుకున్నారు. విజయవాడ నుంచి చెన్నైకి నగదు తీసుకెళుతున్నట్లు  నిందితులు వెల్లడించారని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. పట్టుబడిన నగదును ఐటీ శాఖకు పోలీసులు అప్పగించారు.  పట్టుబడిన సాయికృష్ణ, శ్రీధర్, రవి, లక్ష్మణరావు, అనీల్ కుమార్, సూర్యానారాయణ మూర్తి లు అరెస్ట్ చేశారు.