పెబ్బేరులో పట్టపగలు కారులో నగదు చోరీ

పెబ్బేరులో  పట్టపగలు కారులో నగదు చోరీ

పెబ్బేరు, వెలుగు: పట్టపగలు జనాలు తిరిగే రద్దీ ప్రాంతంలో కారులోని నగదును దొంగిలించడం కలకలం రేపింది. పీజేపీ క్యాంప్​నకు చెందిన ఎంఏ రశీద్​ ఉదయం ఎస్​బీఐ బ్యాంక్​లో రూ.36 వేలు డ్రా చేసి కారులోని డిక్కీలో ఉంచాడు. పట్టణంలోని శాంతి హాస్పిటల్​ ముందు కారు ఆపి, అందులోంచి రూ. వెయ్యి తీసుకొని పోస్ట్ ఆఫీస్​లో ఆర్డీ చేసి వచ్చేలోగా కారు డోర్​ ఓపెన్​ చేసి ఉండడంతో డబ్బులు చూసుకోగా కనిపించలేదు. రూ.35 వేలు చోరీ అయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు శాంతి హాస్పిసిటల్​ సీసీ పుటేజీని పరిశీలించగా, డబ్బును దొంగ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. బ్యాంక్​లో సీసీ పుటేజీని పరిశీలించగా, ఓ వ్యక్తి ఫేస్​కు మాస్క్​ వేసుకొని రశీద్​ ను గమనించడం రికార్డు అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.