
- జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు ఓపెన్
న్యూఢిల్లీ: ఔట్‌డోర్ మీడియా అడ్వర్టయిజింగ్ సంస్థ క్యాష్ యూఆర్ డ్రైవ్ మార్కెటింగ్ తన రూ.61 కోట్ల ఐపీఓ కోసం షేరు ధర బ్యాండ్‌ను రూ.123-–130గా నిర్ణయించింది. ఈ ఐపీఓ ఈ నెల 31న ప్రారంభమై ఆగస్టు 4న ముగుస్తుంది. షేర్లు ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్ ఎమర్జ్‌లో లిస్ట్ అవుతాయి. ఈ పబ్లిక్ ఇష్యూలో 44.69 లక్షల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ ఉంటుంది. వీటి విలువ రూ.58.10 కోట్లు. ప్రమోటర్ పర్వీన్ కే ఖన్నా నుంచి 2.07 లక్షల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ఉంది. వీటి విలువ రూ.2.69 కోట్లు. ఐపీఓ ద్వారా సేకరించిన ఫండ్స్‌ను టెక్నాలజీ, క్యాపిటల్ ఖర్చు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగిస్తామని కంపెనీ చెబుతోంది. క్యాష్ యూఆర్‌కు 2024–25లో రూ.139.32 కోట్ల ఆదాయంపై రూ.17.68 కోట్ల లాభం వచ్చింది.