కులం,డబ్బు,పార్టీ జెండా కాదు.. మనిషిని గుర్తుపెట్టుకోండి

కులం,డబ్బు,పార్టీ జెండా కాదు.. మనిషిని గుర్తుపెట్టుకోండి
  • వీణవంక మండలంలో మంత్రి ఈటెల ఆసక్తికర వ్యాఖ్యలు

కరీంనగర్: వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీణవంక మండలంలోని వల్బపూర్ , రెడ్డిపల్లి కొండపాక , వీణవంక గ్రామాల్లో రైతు వేదిక క్లస్టర్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మం న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదు.. కులం డబ్బు  పార్టీ జెండా కాదు మనిషిని గుర్తుపెట్టుకోవాలన్నారు. ‘‘దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుంది.. పెట్టింది అంతా చెప్పుకోవద్దు.. చేసిందంతా చెప్పుకోవద్దు.. అది గుండెల్లో ఉంటుంది.. నాకు తెలుసు నేను ఇబ్బంది పడుతూ ఉండొచ్చు గాక.. నేను గాయపడుతుండచ్చు గాక..  నేను మనసును మార్చుకోలేదు.. పెట్టిన చెయ్యి  ఆగదు.. చేసే మనిషిని నేను ఆగను.. నేను ఉన్నంతవరకు 20  ఏళ్ల ప్రస్థానంలో నన్ను గొప్పగా ఎంత ఎత్తుకు ఎత్తారో నాకు తెలుసు.. తప్పకుండా  నేను ఉన్నంతవరకు మావాళ్లు ఉన్నంతవరకు.. మీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను..’’ అని అన్నారు. గుండెల మీద చెయ్యి వేసుకుని ఏ విత్తనం వెయ్యాలో చెప్పే స్థాయికి ఎదిగాం.. అంతకుముందు సీడ్ కంపెనీలు మీకు నీళ్లు వస్తాయో రావో.. మీకు సీడ్ ఎలా ఇవ్వాలన్నారు..?  కానీ ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గానికి సీడ్ ఇవ్వడానికి కంపెనీలు ముందుకు వచ్చి ఇస్తున్నాయి.. కాళేశ్వరం నీళ్లు మొట్టమొదటగా ముద్దాడే పంట పొలాలు మన హుజురాబాద్ నియోజకవర్గం.. రెండు పంటలు పండించుకునే స్థాయి వచ్చింది.. ఏ పంట అయినా పండించుకునే స్థాయి వచ్చింది.. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక AEO ను ఏర్పాటు చేశాం.. వందకు వందశాతం మీరు ఊహించని పద్ధతిలో ముల్కనూరు సొసైటీ ఎలా అభివృద్ధి చెందిందో మన హుజురాబాద్ లో సొసైటీ అలా అభివృద్ధి చెందుతుంది.. ఎక్కడ  గొప్పగా సీడ్ ఉందో ,ఎక్కడ గొప్పగా రైతులు ఉన్నారో, ఎక్కడ మంచి విత్తనాలు దొరుకుతాయో అంటే వీటన్నింటికి హుజరాబాద్ బ్రాండెడ్ కావాలి..వీణవంక మండలాన్ని ఆకలి, పేదరికం దుఃఖం లేని మండలంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా..’’ అని మంత్రి ఈటెల చెప్పారు.