బండ్లపై కులాలు, మతాలు చెల్లవిక

బండ్లపై కులాలు, మతాలు చెల్లవిక

కష్టపడో.. ఇష్టపడో కొనుక్కున్న వాహనం. సొంతంగా కొనుక్కుంటే గాడ్​ గిఫ్ట్, అమ్మో, నాన్నో కొనిస్తే వాళ్ల గిఫ్ట్. పార్టీల జెండాలు, పిల్లల పేర్లు, లవ్​ కొటేషన్లు… బైకులు, కార్లపై ఇలాంటి రాతలెన్నో చూస్తుంటాం. కొందరైతే కులం, మతం, ప్రొఫెషన్, హీరోల పేర్ల స్టిక్కర్లూ వేస్తుంటారు. నెంబర్​ ప్లేట్ ​మీదో, కారు అద్దాలపైనో ఇలా స్టిక్కర్లు అతికిస్తుంటారు. ఇది చట్టాన్ని అతిక్రమించడమేనని, దీనికి రూ.5 వేల వరకూ ఫైన్​ వేస్తామని రాజస్థాన్ ​ట్రాఫిక్​పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 3 నుంచి వాహనాలను చెక్​ చేస్తూ ఇలాంటివేవన్నా ఉంటే ఫైన్​ వేస్తున్నారు. ఇలాంటి రాతలతో  సమాజంలో కుల, మతతత్వాలు పెరిగిపోతున్నాయని ట్రాఫిక్​ ఎస్పీ చెప్పారు. విండ్​స్క్రీన్​పై రాతలతో  డ్రైవర్​  కు రోడ్డు సరిగా కనబడదని, దాంతో ప్రమాదాలు జరుగుతాయని అంటున్నారు. అయితే, ఈ రూల్​ను అతిక్రమిస్తే విధించే ఫైన్​ ఎంతనే విషయంపై ఎస్పీ క్లారిటీగా చెప్పలేదు.