
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా ఓ సినిమాను తెరకెక్కుస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలయ్యింది. ఆ సంధర్బంగా విడుదలైన పోస్టర్ ఆడియన్స్ లో అంచనాలు పెంచేసింది. రూరల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో నటించ అవకాశాన్ని కొత్త నటీనటులకు ఇవ్వనున్నారు. ఈమేరకు కాస్టింగ్ కాల్ పోస్టర్ విడుదల చేశారు. యాక్టింగ్ వస్తే చాలు, తెలుగొస్తే సంతోషం, గోదారి యాసొత్తే ఇంకాపేవోడే లేడు.. అంటూ వవినూత్నరీతిలో ఈ ప్రకటన చేశారు. ఇందుకొసం తమ తమ ప్రొఫైల్స్ ను svc59casting@gmail.comకి మెయిల్ చేయాలని చెప్పారు. మరి మీరు కూడా ఈ సినిమాలో భాగమయ్యే అవకాశాన్ని దక్కించుకొండి.
Acting osthe chaaalu…?
— Sri Venkateswara Creations (@SVC_official) June 19, 2024
తెలుగొస్తే సంతోషం… ?
గోదారి యాసొత్తే ఇంకాపేవోడే లేడు ?
Put yourself on the Big Screen &
The Bigger World of #SVC59 ✊
Share your profiles on svc59casting@gmail.com
(or)?️ WhatsApp on +91 9676843362@TheDeverakonda @storytellerkola@SVC_official pic.twitter.com/4yNBePoGvH
ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ప్రస్తుతం దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సి హీరోయిన్ గా నటిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది. కొంత కాలంగా సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్న విజయ్ కి ఈ సినిమాతో విజయం వరిస్తుందా అనేది చూడాలి.