పిల్లి కోసం కోర్టు మెట్లెక్కిన యజమాని

పిల్లి కోసం కోర్టు మెట్లెక్కిన యజమాని

తన పెంపుడు జంతువు కోసం ఏకంగా పోలీసులపైనే కోర్టులో పిటీషన్ వేశాడు కేరళకు చెందిన ఓ వ్యక్తి. లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా సర్వం స్తంభించిపోయింది. పోలీసులు ప్రజలెవరినీ రోడ్ల మీదికి రానివ్వడం లేదు. అయితే కేరళకు చెందిన ప్రకాశ్ అనే వ్యక్తి మూడు పిల్లులను పెంచుకుంటున్నాడు. లాక్ డౌన్ వల్ల పిల్లులకు పెట్టే ఆహారం అంతా అయిపోయింది. దాంతో ఎలాగైనా వాటికి ఆహారం తేవాలని ప్రకాశ్ నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆన్ లైన్ లో పాస్ ఇవ్వాల్సిందిగా పోలీసులను కోరాడు. అందుకు వారు అంగీకరించలేదు. దాంతో ప్రకాశ్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేరళ హైకోర్టులో పిటీషన్ వేశాడు.

‘నేను మూడు పిల్లలను పెంచుకుంటున్నాను. నేను శాఖాహారిని కావడంతో వాటికి మీయో పెర్షియన్ అనే బిస్కట్లను ఆహారంగా ఇస్తాను. 7 కేజీల బరువుండే ఒక ప్యాకెట్ వాటికి మూడు వారాలు సరిపోతుంది. ఇప్పుడు బిస్కెట్లు అయిపోవడంతో.. ఏప్రిల్ 4న ఆన్ లైన్ లో పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. కానీ, పోలీసులు మాత్రం నా దరఖాస్తును తిరస్కరించారు. జంతు చట్టంలోని సెక్షన్ 3 మరియు 11ల ప్రకారం.. పెంపుడు జంతువులకు ఆశ్రయం మరియు ఆహారాన్ని పొందే హక్కు ఉంది. కోర్టు దీనిపై తగు నిర్ణయం తీసుకుంటుంది’ అని ప్రకాశ్ అన్నారు.

For More News..

సీఎం కేసీఆర్ మాటమీద నిలబడతారా? ఓవైసీని అరెస్ట్ చేస్తారా?

జూలోని పులికి కూడా కరోనా వైరస్

పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగిన ఏపీ ఎమ్మెల్యే

రాష్ట్రంలో 334కు చేరిన కరోనా కేసులు