ప్రపంచాన్ని వణికిస్తున్న విలయాలు: అమెరికాలో టోర్నడో .. యూరప్‌‌‌‌లో కార్చిచ్చు

ప్రపంచాన్ని వణికిస్తున్న విలయాలు: అమెరికాలో టోర్నడో .. యూరప్‌‌‌‌లో కార్చిచ్చు
  • ఇండ్ల పైకప్పులు ధ్వంసం, 4 లక్షల ఇండ్లకు నిలిచిపోయిన విద్యుత్
  • యూరప్‌‌‌‌లో కార్చిచ్చు
  • భానుడి భగభగలు.. విరుచుకుపడుతున్న మంటలు
  • ఫ్రాన్స్‌‌‌‌, స్పెయిన్‌‌‌‌లో  వేల ఎకరాల్లో అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతి
  • ఫ్రాన్స్‌‌‌‌లోని గిరాండ్‌‌‌‌లో కాలి బూడిదైన 240కి పైగా విలాసవంతమైన ఇండ్లు
  • మంటల వేడికి తాళలేక రోడ్లపైకి వచ్చిన జంతువులు
  • ఇరు దేశాల్లో  సుమారు 3.3 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • స్పెయిన్‌‌‌‌లో దేశ చరిత్రలోనే మొదటిసారి నేషనల్ ఎమర్జెన్సీ
  • ఇండ్ల పైకప్పులు ధ్వంసం, వేలాది ఇండ్లకు నిలిచిపోయిన విద్యుత్

విస్కాన్సిన్‌‌‌‌‌‌‌‌: అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. నార్త్​ఈస్ట్ విస్కాన్సిన్‌‌‌‌‌‌‌‌లోని మెనాషా, ఆపిల్‌‌‌‌‌‌‌‌టన్ ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం టోర్నడో విరుచుకుపడడంతో వేలాది ఇండ్లు దెబ్బతిన్నాయి. ఆపిల్‌‌‌‌‌‌‌‌టన్‌‌‌‌‌‌‌‌లో అనేక ఇండ్ల కప్పులు ఎగిరిపోయి పూర్తిగా ధ్వంసంకాగా, చెట్లు వేళ్లతో సహా కూలిపోయాయి. దీంతో వేలాది ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మెనాషాలో ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. 

ఓ వెహికల్ రోడ్డు పక్కన బోల్తా పడింది. అమెరికా జాతీయ వాతావరణ సంస్థ (ఎన్​డబ్ల్యూఎస్​) ఈ టోర్నడోను ‘అత్యంత ప్రమాదకరమైనది’గా అభివర్ణించింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రెండో అతిపెద్ద ప్రమాద హెచ్చరిక అయిన ‘పర్టిక్యులర్లీ డేంజరస్ సిట్యుయేషన్’ టోర్నడో వార్నింగ్‌‌‌‌‌‌‌‌ను జారీ చేసింది. టోర్నడో మెనాషాను తాకిన తర్వాత, వినెబాగో సరస్సు మీదుగా పయనించి నీటిపైనే శాంతించింది. 

ఆపిల్‌‌‌‌‌‌‌‌టన్ సమీపం నుంచి సరస్సు ఉత్తర తీరం వరకు దాదాపు 20 నిమిషాల పాటు ఇది కనిపించింది. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రాథమిక సర్వే ప్రకారం.. ఈ టోర్నడో తీవ్రత ఈఎఫ్​2 కేటగిరీకి చెందినదిగా అంచనా వేశారు. ప్రస్తుతం సర్వే కొనసాగుతోంది.. త్వరలోనే నష్టం వివరాలు వెల్లడికానున్నాయి. 

ఈ సందర్భంగా మెనాషా పోలీస్ చీఫ్ మాథ్యూ ఆల్బ్రెచ్ట్ మాట్లాడుతూ.. ప్రజలు బయటకు రావొద్దని, ఇండ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. తెగిపడిన విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. రోడ్లు మూసివేసిన ప్రాంతాల్లో, అత్యవసరమైతే తప్ప బయట వాహనాలు నడపవద్దని మెనాషా పోలీస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లో పోస్ట్ చేసింది. మెనాషా సిటీ మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఉండవచ్చని మెనాషా యుటిలిటీస్ తెలిపింది.  

ముందస్తు హెచ్చరికలు లేకుండానే..

ఈ ప్రాంతానికి టోర్నడో ముప్పు ఉంటుందని ముందస్తుగా ఊహించలేదు. ఆపిల్‌‌‌‌‌‌‌‌టన్, మెనాషాకు మొదటి టోర్నడో హెచ్చరిక సోమవారం ఉదయం 11:59 గంటలకు వచ్చింది. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం టోర్నడో ఉదయం 11:56 గంటలకే మొదలైంది. అంటే టోర్నడో రాకముందు ఎలాంటి హెచ్చరిక జారీ కాలేదని  తేలింది. ఉదయం 11:13 గంటలకు తీవ్రమైన ఈదురుగాలుల హెచ్చరిక జారీ చేయగా.. 11:21 గంటల అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌లో టోర్నడో వచ్చే అవకాశం ఉందని ప్రస్తావించారు.