Summer Special : ఇంట్లోనే క్యాలీఫ్లవర్ వెరైటీ స్నాక్స్ ఇలా చేసుకోవచ్చు.. హోటల్ టేస్టీ

Summer Special : ఇంట్లోనే క్యాలీఫ్లవర్ వెరైటీ స్నాక్స్ ఇలా చేసుకోవచ్చు.. హోటల్ టేస్టీ

గోబీ అంటే ఇష్టపడని వాళ్లుండరు. అందుకే హోటల్కి వెళ్లగానే చాలామంది ఫస్ట్ గోబీ ఆర్డర్ చేస్తారు. సూప్ తర్వాత స్టార్టర్గా క్యాలీఫ్లవర్ ఐటమ్స్ లాగిస్తారు. ఇంట్లోనే వెరైటీగా గోబీని ఎలా వండుకోవాలో తెలియట్లేదా? అయితే, మీ కోసమే ఈ రెసిపీలు..

క్యాలీఫ్లవర్ పకోడి

కావాల్సినవి : క్యాలీఫ్లవర్ ముక్కలు: రెండు కప్పులు, శెనగపిండి: ఒకటిన్నర కప్పు, బియ్యప్పిండి: రెండు టీ స్పూన్లు, కారం: అర టీ స్పూన్ ,ఉప్పు: రుచికి సరిపడా, గరంమసాలా: అర టీ స్పూన్, నూనె: వేగించడానికి, మంచినీళ్లు: తగినన్ని

తయారీ : శెనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, గరం మసాలా, కారం కలిపి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలపాలి. తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలను గోరువెచ్చని నీటిలో కాసేపు ఉంచి పేపర్పై ఆరబెట్టాలి. ఇప్పుడు పకోడీల పిండిలో క్యాలీఫ్లవర్ ముక్కలను ముంచి బాగా కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేగించాలి. అంతే కరకరలాడే క్యాలీఫ్లవర్ పకోడీలు రెడీ.

క్యాలీఫ్లవర్ బిస్కట్లు

కావాల్సినవి : క్యాలీఫ్లవర్: పెద్దది (పెద్ద ముక్కలుగా కట్ చేయాలి), వెల్లు ల్లి: మూడు రెబ్బలు, గడ్డ పెరుగు: ముప్పావు కప్పు, చీజ్ పావు కప్పు (సన్నగా తురమాలి), ఉప్పు: ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి: అర టేబుల్ స్పూన్, కోడిగుడ్లు: రెండు

తయారీ

క్యాలీఫ్లవర్ ముక్కలను ఒవెన్ లో ఇరవై నిమిషాలు ఉడికిం చాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలను సన్నగా కట్ చేసి ఉడికిన క్యాలీఫ్లవర్ తో కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని వెడ ల్పాటి పాన్ లో వేసి చీజ్, ఉప్పు, మిరియాల పొడి, పెరుగు వేసి బాగా కలపాలి. ఇందులోనే గుడ్డులోని తెల్లసొన వేసి బాగా కలపాలి. తర్వాత వీటిని రౌండ్ షేప్లో వత్తి ఒవెన్లో పావు గంట బేక్ చేయాలి.