తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. గంటలోనే కాషన్ డిపాజిట్ రీఫండ్

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. గంటలోనే కాషన్ డిపాజిట్ రీఫండ్

నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అలానే తాజాగా తిరుమల శ్రీవారి భక్తులకు సంబంధించి.. ఓ కీలక విషయాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో యుపీఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన ఒక గంటలోపు కాషన్‌ డిపాజిట్‌ మొత్తం రీఫండ్‌ చేయడం జరుగుతోందన్నారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలు కీలక అంశాలపై స్పష్టత ఇచ్చారు.

తిరుమల శ్రీవారి భక్తుల గదుల కాషన్ డిపాజిట్‌పై టీటీడీ మరోసారి క్లారిటీ ఇచ్చింది. శ్రీవారి దర్శనార్థం విచ్చేసి.. యుపీఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు.. గదులు ఖాళీ చేసిన ఒక గంటలోపు కాషన్‌ డిపాజిట్‌ మొత్తం రీఫండ్‌ చేస్తున్నామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.

 భక్తులు అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రధానంగా గదుల విషయానికి సంబంధించిన అంశాలపై స్పష్టత ఇచ్చారు. కాషన్ డిపాజిట్ విషయంలో ఆందోళన అవసరం లేదని ఆయన తెలిపారు. ఆ డబ్బులు మూడు నుంచి 7 పని దినాల్లో ఆ డబ్బులు తిరిగి అకౌంట్‌కు జమ అవుతాయన్నారు. ఎప్పటికప్పుడు మెసేజ్‌ల రూపంలో భక్తులు ఈ వివరాలను చెక్ చేసుకోవచ్చన్నారు. తిరుమలలో యుపీఐ విధానంలో నగదు చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు ఓ ముఖ్య విషయం చెప్పారు. అలా గదులు పొందిన వారు.. ఖాళీ చేసిన ఒక గంటలోపు కాషన్‌ డిపాజిట్‌ మొత్తం రీఫండ్‌ చేయడం జరుగుతోందన్నారు.

అదే విధంగా క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు ఖాళీ చేసిన ఒక గంటలోనే రీఫండ్‌ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. అయితే ఈ మొత్తం భక్తులు బ్యాంకు ఖాతాల్లోకి చేరడానికి 3 నుంచి 7 పనిదినాల సమయం పడుతుంది అన్నారు. కొందరు నిబంధనల మేరకు గది ఖాళీ చేయడం లేదని.. వెరిఫికేషన్‌ కోడ్‌ చూపకపోవడం, ఫొటో సరిపోకపోవడంతో రీఫండ్‌ జనరేట్‌ కావడం లేదని ఈవో తెలిపారు. ప్రస్తుతం రీఫండ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ రూపంలో పంపుతున్నట్లు తెలిపారు. త్వరలో రీఫండ్‌ను ట్రాక్‌ చేసేందుకు టీటీడీ వెబ్‌సైట్‌లో ట్రాకర్‌ను పొందుపరుస్తామన్నారు.