
కర్ణాటక ఎగువప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీవర్షాలతో హొగెనేకల్ లో కావేరి నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రమాదస్థాయిలో వరద నీరు పోటెత్తుతోంది. దీంతో తమిళనాడులోని కావేరి పరివాహక ప్రాంతాల్లో ప్రమాదస్థితి నెలకొంది. వెంటనే అలర్టైన ఆయా జిల్లాల అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మరోవైపు ధర్మపురి జిల్లాలోని హొగెనేకల్ జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు పోలీసులు. భారీ భద్రతను ఏర్పాటు చేసి… ఎవరూ కావేరి పరివాహక ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరికలు, నిషేదాజ్ఞలు జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.