నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దర్ని అరెస్ట్ చేసిన CBI

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దర్ని అరెస్ట్ చేసిన CBI

నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో సీబీఐ జూలై 16న మరో ఇద్దర్ని అరెస్ట్ చేసింది. ఈ కేసులో బీహార్ లోని పాట్నా, జార్ఖండ్ లోని హజారీబాగ్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్  ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేశారు. ఫస్ట్ అనుమానితుడు ఆదిత్య అనే పంకజ్ సింగ్ హజారీబాగ్‌లో పట్టుబడ్డాడు.  జార్ఖండ్ లో సీల్ వేసిన ట్రంక్ పెట్టల నుంచి ప్రశ్నపత్రాలను తీయడంలో పంకజ్ సింగ్ కి కీలక పాత్ర అని ఆరోపణలు ఉన్నాయి. పాట్నాలో అరెస్టయిన రెండో నిందితుడు లీకైన పేపర్ల పలువురికి డిస్టిబ్యూట్ చేశాడు.

ALSO REEAD | నాలుగేళ్లలో 8కోట్ల ఉద్యోగాలు.. మోదీ చెప్పినవన్నీ అబద్ధాలే: మల్లికార్జున్ ఖర్గే