ఆయేషా మీరా కేసులో సీబీఐ ఎదుట హాస్టల్​ వార్డెన్​ ఆయేషా మీరా కేసులో సీబీఐ ఎదుట హాస్టల్​ వార్డెన్​ 

ఆయేషా మీరా కేసులో సీబీఐ ఎదుట హాస్టల్​ వార్డెన్​ ఆయేషా మీరా కేసులో సీబీఐ ఎదుట హాస్టల్​ వార్డెన్​ 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తు హైదరాబాద్ సిబీఐ కేంద్రంగా జరుగుతుంది. విచారణలో భాగంగా   ఆయేషామీరా ఉన్న హాస్టల్​ వార్డెన్​ను సీబీఐ పిలిచింది. విచారణ అనంతరం తరువాత వార్డెన్​ సీబీఐ కార్యాలయం నుంచి వెళ్లి పోయారు.   

2007  డిసెంబర్ 27 వ తారీఖున విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆయేషామీరా హత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం కాగా, పోలీసులపై తీవ్ర ఒత్తిడి నెలకున్న నేపథ్యంలో సత్యంబాబును అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం దిగువ కోర్టు అతడికి యావజ్జీవ శిక్ష విధించగా.. 2017లో హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు నిందితులను తేల్చే పనిలో సీబీఐ విచారణ కొనసాగుతుంది.