సీబీఎస్ఈ రిజల్ట్స్.. మీ హాల్ టికెట్ నెంబర్ తెలుసా?

సీబీఎస్ఈ రిజల్ట్స్.. మీ హాల్ టికెట్ నెంబర్ తెలుసా?

సీబీఎస్ఈ ఫలితాలు నేడు విడుదలకానున్నాయి. కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని హాల్ టికెట్ల్ విడుదల చేయడానికి ముందు బోర్డు పరీక్షలు రద్దు చేయబడ్డాయి. దాంతో విద్యార్థులకు హాల్ టికెట్లు జారీకాలేదు. కాగా.. విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవాలంటే.. హాల్ టికెట్ నెంబర్ ఖచ్చితంగా కావాలి. అందుకే విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ తెలుసుకోవడం కోసం బోర్డు ఒక సింపుల్ లింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ లింకును తమ అధికారిక పోర్టల్స్ cbse.nic.in మరియు cbse.gov.inలో యాక్టివేట్ చేయబడింది. సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు నేడు విడుదల అవుతుండగా.. 12వ తరగతి ఫలితాలు జూలై 31న విడుదల కానున్నాయి. కాగా.. విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవడానికి వారి తండ్రి మరియు తల్లి పేర్ల వంటి వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 

విద్యార్థులకు ఫలితాలను కేటాయించడానికి బోర్డు ఒక విధానాన్ని ఎంచుకుంది. ఇంటర్నల్ అసెస్‌మెంట్, అర్ధవార్షిక మరియు ప్రీబోర్డ్ పరీక్షలలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా 10వ తరగతి ఫలితం కేటాయించాలని నిర్ణయించారు. కనీస ఉత్తీర్ణత మార్కులు 33 శాతం సాధించలేని విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వాలని బోర్డు పాఠశాలలను కోరింది.

CBSE రోల్ నెంబర్ ఫైండర్‌ను యాక్సెస్ ఎలా చేయాలంటే?

స్టేజ్ 1: ముందుగా CBSE యొక్క అధికారిక పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.
స్టేజ్ 2: పేజీని కిందికి స్క్రోల్ చేసి ‘రోల్ నెంబర్ ఫైండర్’ పై క్లిక్ చేయండి.
స్టేజ్ 3: ఆ తర్వాత మీరు మరో కొత్త పేజీకి ఎంటర్ అవుతారు. అక్కడ ‘కంటిన్యూ’పై క్లిక్ చేయాలి.
స్టేజ్ 4: తదుపరి మీరు 10వ తరగతి లేదా 12వ తరగతి ఏది కావాలో ఎంచుకోవాలి.
స్టేజ్ 5: అక్కడ మీ పేరు, తండ్రి పేరు, పాఠశాల కోడ్, పుట్టిన తేదీ మరియు తల్లి పేరు ఎంటర్ చేయాలి.
స్టేజ్ 6: అనంతరం ప్రొసీడ్ మీద క్లిక్ చేసి క్లాస్ 10 లేదా క్లాస్ 12 రోల్ నంబర్‌ను పొందవచ్చు.