సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు

సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతుండటంతో.. సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి వల్ల ఎగ్జామ్స్ రద్దు చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గతంలో ప్రధాని మోడీని కోరారు. కేజ్రీవాల్ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. మరికొన్ని రాష్టాలు కూడా ఎగ్జామ్స్ రద్దు చేయాలని మోడీని కోరాయి. దాంతో ప్రధాని మోడీ బుధవారం కేంద్ర విద్యాశాఖతో భేటీ అయ్యారు. అధికారులతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు మరియు 11,12 తరగతుల ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఆధారంగానే టెన్త్ ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. జూన్ 1 తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తెలియజేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. 15 రోజుల ముందుగానే కొత్త షెడ్యూల్ విడుదలచేస్తామని విద్యాశాఖ తెలిపింది.