ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా టెన్త్ రిజల్ట్స్

ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా టెన్త్ రిజల్ట్స్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని మోడీ బుధవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తో పాటు కేబినెట్ సెక్రెటరీ, పలువురు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. మీటింగ్ లో అధికారులతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు.. అలాగే 11,12 తరగతుల ఎగ్జామ్స్ ను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ ప్రకటించారు. ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఆధారంగానే టెన్త్ ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇంటర్నల్ అసెస్మెంట్ ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు కరోనా పరిస్థితి సద్దుమణిగాక తిరిగి పరీక్షలకు హాజరు కావొచ్చని తెలిపారు.