తిరుమల కొండపై సైకోగాడు : ATM సెంటర్లలో వైర్లు కట్ చేస్తున్నాడు..!

తిరుమల కొండపై సైకోగాడు : ATM సెంటర్లలో వైర్లు కట్ చేస్తున్నాడు..!

హిందువులకు ఆరాధ్యదైవం.. పవిత్ర పుణ్య క్షేత్రం.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండపై ఈ మధ్య కాలంలో సైకోల ఆగడాలు ఎక్కువయ్యాయి.  భక్తుల రద్దీని గమనించి సైకోస్​ వారి పని వారు చేసుకుంటున్నారు.  ఈ రోజు ( ఆగస్టు19) ఓ సైకో తిరుమల కొండపై ఏం చేశాడో చూడండి..

దొంగల భయం.. కేటుగాళ్లు.. జేబులు కత్తిరించే వాళ్లు సమాజంలో తిరుగుతూ గుట్టు చప్పుడు కాకుండా మనకు తెలియకుండానే మన సొమ్మును కాజేస్తున్నారు.  అయితే ఏటీఎం లు వచ్చిన తరువాత ఎక్కడ పడితే  అక్కడ పెట్టి.. ఎప్పుడు ఎక్కడ ఎంత కావాలో అంత డబ్బును డ్రా చేసుకుంటున్నారు.   

తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది  కలుగకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్​ ఎదురుగా యూనియన్​ బ్యాంక్​ ఏటీఎంను ఏర్పాటు చేశారు.  జనాల దగ్గర డబ్బులు లేవని గమనించాడో.. ఏమో తెలియదు కాని ఓ సైకో ఏకంగా ఏటీఎంను దోచుకునేందు ప్లాన్​ వేశాడు.  అటూ.. ఇటూ చూసి ఎవరికి అనుమానం రాకుండా ఏటీఎంలోకి దూరి అక్కడ ఉన్న  సీసీ కెమెరా వైర్లను కట్​ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన  కమాండ్​ కంట్రోల్​ విజిలెన్స్​ సిబ్బంది.. కళ్యాణ వేదిక దగ్గర ఆ సైకోను అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ దొంగ కర్నాటక రాష్ట్రానికి తుంకూరుకు చెందిన ప్రవీణ్​ కుమార్​ ( 36) గా గుర్తించారు.  అతని తండ్రి పేరు నీలకంఠాచారని ... నిందితుడు కర్నాటకలో జేసీబీ డ్రైవర్​ గా పని చేస్తున్నాడు. అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదని తమ​ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.