నిజామాబాద్ జిల్లాలో..ఆరు నెలలకే కూలిన సీసీ రోడ్డు

నిజామాబాద్ జిల్లాలో..ఆరు నెలలకే కూలిన సీసీ రోడ్డు

నవీపేట్, వెలుగు : అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల నాసిరకం పనులతో ఆయా చోట్ల వేసిన కొన్ని నెలలకే రోడ్లు ధ్వంసమవుతున్నాయి. నవీపేట్​ మండలంలోని అబ్బాపూర్ (బి) నుంచి అబ్బాపూర్​ తండాకు వెళ్లేందుకు ఆరునెలల కింద రూ.46 లక్షల ఖర్చుతో సీసీ రోడ్డు వేశారు.  

కానీ కొన్నాళ్లకే సీసీ రోడ్డు ధ్వంసమైంది. నాసిరకం పనులు, క్యూరింగ్ సరిగా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గ్రామస్తులు వాపోతున్నారు. కల్వర్ట్​ నిర్మించాల్సిన చోట సీసీ రోడ్డు వేయడంతో కూలిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.