ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడీతో అమ్మాయిలకు వేధింపులు

ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడీతో అమ్మాయిలకు వేధింపులు

తమ టాలెంట్ ను చూపించేందుకు అమ్మాయిలు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ ను వాడుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది యువతులు వేధింపులకు గురవుతున్నారు. ఫేక్ ఐడీలతో అమ్మాయిలను ట్రాప్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పపడుతున్నారు కొంతమంది దుర్మార్గులు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది.
ఇన్స్టాగ్రామ్లో నకిలీ ప్రొఫైల్ సృష్టించి అమ్మాయిలను వేధిస్తున్న యువకుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెంకు చెందిన విజయకుమార్.. అమ్మాయిలకు న్యూడ్ కాల్స్ చేసి వేధింపులకు పాల్పడ్డాడు. న్యూడ్ కాల్స్ రికార్డ్ చేసి... వీడియో మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని విజయ్ కుమార్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు విచారణ చేపట్టగా..విజయ్ కుమార్, ఇన్స్టాగ్రామ్లో వందల కొద్ది  అమ్మాయిలను న్యూడ్ కాల్స్ చేసి వేదించిన గుర్తించారు. దీంతో నిందితుడు విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.