సంగారెడ్డి జిల్లాలో గ్యాస్​ రీ ఫిల్లింగ్​ స్థావరాలపై పోలీసులు దాడులు

సంగారెడ్డి జిల్లాలో గ్యాస్​ రీ ఫిల్లింగ్​ స్థావరాలపై పోలీసులు దాడులు

సదాశివపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని సైకిల్​ రిపేర్​షాపు, మండల పరిధిలోని ఆరూర్​ గ్రామ శివారులో ధరణి వాటర్​ ప్లాంట్​లో అక్రమంగా గ్యాస్​ రీఫిల్లింగ్​ చేస్తున్నారన్న సమాచారంతో బుధవారం సీసీఎస్​ పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 489 గ్యాస్​ సిలిండర్లు సీజ్​ చేసి, అక్రమ రిఫీల్లింగ్​ కు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేశారు. సీసీఎస్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సదాశివపేట కు చెందిన ధరణి వాటర్​ ప్లాంట్​ యజమాని తులసి రాజేందర్

ఉదయ్​రాజ్​పాల్​, మన్నె సతీశ్ అక్రమ గ్యాస్ ఫిల్లింగ్​దందా నిర్వహిస్తున్నారు. సదాశివపేట పట్టణంలోని అబ్దుల్ సలీం గాంధీచౌక్​ వద్ద సైకిల్​ రిపేర్​ షాపు నడుపుతూ షాపు లోపల అక్రమ గ్యాస్​ రీఫిల్లింగ్​ చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో దాడులు నిర్వహించి మొత్తం బుడ్డీలు, రీఫిల్లింగ్​ సామాన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.