ఉత్తరప్రదేశ్ లో మధురలో మంగళవారం (సెప్టెంబర్ 26న) ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (EMU) రైలు ప్లాట్ ఫారమ్ ను ఢీకొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ప్రమాద సమయంలో రైల్వే టెక్నిషియన్ క్యాబ్ (ఇంజిన్ )కీ ని తీసుకునేందుకు వెళ్లారని.. అజాగ్రత్తగా తన బ్యాగ్‌ని ఇంజన్ థొరెటల్‌పై పెట్టి మొబైల్‌లో బిజీ అవ్వడంతో ఈ ప్రమాదానికి కారణమయ్యాడని అధికారులు తేల్చారు.
తాగుబోతు టెక్నీషియన్ రైలు థ్రోటల్‌పై బ్యాగ్‌ని ఉంచడంతో..
అధికారులు ఇచ్చిన నివేదక ప్రకారం.. బ్యాగ్ ఒత్తిడి కారణంగా థొరెటల్ ఫార్వర్డ్ పొజిషన్‌లోకి వెళ్లి EMU ప్లాట్‌ఫారమ్ వైపు వెళ్లేలా చేసిందని గుర్తించారు. దీంతో ప్లాట్‌ఫారమ్ డెడ్ ఎండ్‌ను ఢీకొట్టింది. డ్రైవర్ సచిన్ కు నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో 47 mg/100 ml రీడింగ్‌ని తేలిందని ఇది స్వల్పంగా తాగినట్లుగా పరిగణించబడుతుందని నివేదిక పేర్కొంది. ఈ ఘటనలో డ్రైవర్ సచిన్ తో సహా టెక్నికల్ స్టాఫ్ హర్భజన్ సింగ్, బ్రజేష్ కుమార్, కుల్జీత్ , గోవింద్ హరి శర్మ లోకో ఫైలట్ లను రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. ఒకదానిలో ఉమ్మడి నివేదిక పేర్కొంది.
ALSO READ: యూట్యూబ్ వీడియో లింకింగ్ స్కాం: రూ.13 లక్షలు పోగొట్టుకున్న మహిళ
మంగళవారం ( సెప్టెంబర్ 26)న ఢిల్లీ నుంచి వచ్చి రైలు పట్టాలు తప్పి మధుర జంక్షన్‌లోని ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. రైలు ప్లాట్‌ఫాం ఎక్కి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఆగిపోయింది. రైలు ఇంజన్‌కు ప్లాట్‌ఫారమ్‌లోని కొంత భాగం, విద్యుత్ స్తంభం దెబ్బతింది.