సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సెప్టెంబర్‌నెలలో సేకరించిన మందుల శాంపిల్ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. నివేదిక ప్రకారం..112మందులు నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ధృవీకరించింది. ఈ మందులలో యాంటీబయాటిక్స్, పెయిన్‌కిల్లర్స్, విటమిన్లు, సాధారణంగా మార్కెట్‌లో లభించే ఇతర ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ఉన్నాయి. గత కొన్ని నెలలుగా మందుల తయారీ కంపెనీలపై దృష్టి పెట్టిన CDSCO ..కేంద్ర ఔషధ పరీక్షా ప్రయోగశాలలో 52, రాష్ట్ర ఔషధ పరీక్షా ప్రయోగశాలలు 60 మందుల శాంపిల్స్ ను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని నిర్ధారించాయి. ఈ నిర్ధారణ తరువాత కొన్ని మందుల తయారీదారుల లైసెన్స్‌లను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభించింది.
ఆగస్టు నెలలో కేంద్ర ,రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు పరీక్షించిన 94 డ్రగ్స్ శాంపిల్స్ లను NSQగా CDSCO ప్రకటించింది. ఆగస్టులో సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీస్ 32 ఔషధ శాంపిల్స్, స్టేట్ డ్రగ్స్ టెస్టింగ్ లాబొరేటరీస్ 62 ఔషధ శాంపిల్స్ పరీక్షలో విఫలమయ్యాయని గుర్తించింది.
ప్రధానంగా తక్కువ నాణ్యత గల మందులలో జన్ ఔషధ కేంద్రాలకు సరఫరా చేసే యాంటీబయాటిక్ యాంపిసిలిన్ ఇంజక్షన్ IP 500 mg,అమోక్సిసిలిన్ & పొటాషియం క్లావులనేట్ ఇంజెక్షన్ IP 1200 mg, Bupivacaine Injection IP, CALXIA కాల్షియం కార్బోనేట్ 500 MG + VIT. D3 250 IU టాబ్లెట్లు IP, గ్లిమెపిరైడ్ టాబ్లెట్లుIP 1 mg, స్పేడ్ సెరాటియోపెప్టిడేస్ మాత్రలు IP 5 mg, మెకోసోల్-ప్లస్ క్యాప్సూల్స్ మెహ్టైల్కోబాలమిన్, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్, పిరిడాక్సిన్ HCl & థియామిన్ మోనోనిట్రేట్ క్యాప్సూల్స్ మందులలో నాణ్యతా ప్రమాణాలు లేవని CDSCO నిర్ధారించింది.
