ఎలక్షన్​ కమిషనర్ల శాలరీల్లో కోత

ఎలక్షన్​ కమిషనర్ల శాలరీల్లో కోత
  • 30% వదులుకునేందుకు సిద్ధమైన సీఈసీ, కమిషనర్లు

న్యూఢిల్లీ: కరోనా వ్యతిరేక పోరాటంలో భాగంగా తమ శాలరీల్లో 30 శాతం కోత విధించుకునేందుకు ఎలక్షన్​ కమిషనర్లు సిద్ధమయ్యారు. చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​ సునీల్​ అరోరా, కమిషనర్లు అశోక్​ లావాసా, సుశీల్​ చంద్ర తమ బేసిక్​ శాలరీలో 30 శాతాన్ని ఏడాది పాటు స్వచ్ఛందంగా వదులుకోవాలని నిర్ణయించారు. సర్వీసులను బట్టి సుప్రీంకోర్టు జడ్జిలతో సమానంగా వీరికి శాలరీ ఉంటుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జీలు నెలకు రూ.2.5 లక్షల శాలరీ డ్రా చేస్తున్నారు. ఏప్రిల్​ 1 నుంచి ఈ కోత అమలులోకి రానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.