భోజనం చేస్తుండగా ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్ 

భోజనం చేస్తుండగా ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్ 

ప్రమాదాలు ఎప్పుడు..ఎలా జరుగుతాయనేది మనకు చెప్పి జరగవు. అలాంటి అనుకోని ప్రమాదం నుంచి ఓ కుటుంబ సభ్యులు లక్కీగా బయట పడ్డారు. అదృష్ణ వశాత్తు  ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాకపోవడం ఊపిరి పీల్చుకున్నారు.

 వియత్నాంలోని బాక్ నిహ్ కు చెందిన ఓ కుటుంబంని ఆరుగురు సభ్యులు అంతా ఒకే దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నారు. అయితే అదే సమయంలో సరిగ్గా వారిపైనే ఉన్న సీలింగ్ ఫ్యాన్ అకస్మాత్తుగా ఊడి వారి మీద పడింది. వారు చుట్టూ కూర్చుని భోజనం చేస్తుండగా..వారి మధ్యలో ఫ్యాన్ పడిపోవడంతో ఎవరికీ ఏమీ కాలేదు. పడిపోయన ఫ్యాన్ ను తీసేసి అంతా కలిసి భోజనం చేశారు. ఫ్యాన్ కింద పడిన సమయంలో అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఆ విజువల్స్ రికార్డ్ అయ్యాయి.

ఈ ఘటన జులై 8, 2021 జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా తెలియడం..ప్రస్తుతం ఆ వీడియో కాస్తా వైరల్ అవుతోంది.