- గన్ పార్క్ దగ్గర టీఎన్జీఓస్ సంబురాలు
హైదరాబాద్, వెలుగు : ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావటం అభినందనీయమని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారికి ధన్యవాదాలు తెలిపారు.
మంగళవారం ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులతో గన్ పార్క్ దగ్గర టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఉద్యోగుల దశాబ్ద కల నెరవేరిందని చెప్పారు.