
ట్విటర్.. యూజర్లకు షాకిచ్చింది. ట్విట్టర్ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ రూల్ ను అమలుచేయడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఫ్రీగా ఇచ్చిన ట్విట్టర్ బ్లూటిక్.. ఇకనుంచి డబ్బులు కట్టి సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే డబ్బులు కట్టలేదో వాళ్ల బ్లూ టిక్ మార్క్ తొలగిస్తోంది ట్విట్టర్. ఈ నేపథ్యంలో భారత్ లోని పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల బ్లూటిక్స్ తొలగించబడ్డాయి.
ఈ లిస్ట్ లో ఏపీ సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఉన్నారు. క్రిడాకారుల్లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ బ్లూటిక్ కూడా పోయింది. సినీ నటులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ సహా చాలామంది ప్రముఖుల ట్విటర్ ఖాతాలకు బ్లూటిక్ తొలగించబడ్డాయి.
ఇదివరకే సబ్ స్క్రైబ్ చేసుకోని వాళ్ల ఖాతాల బ్లూటిక్ తొలగిస్తామని హెచ్చరించిన ట్విటర్.. ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు మంత్రి కేటీఆర్, మహేశ్ బాబు, జూ. ఎన్టీఆర్ సబ్ స్క్రైబ్ చేసుకోవడంతో వాళ్ల బ్లూటిక్ అలానే ఉంది. బ్లూటిక్ కావాలంటే నెలకు రూ.900, సంవత్సరానికి రూ.9,400 చెల్లించాల్సి ఉంటుంది.
బ్లూటిక్ కోల్పోయిన మరికొంత మంది ప్రముఖులు:
- ఆర్ఎస్ఎస్
- బీజేపీ (పార్టీ అకౌంట్)
- మమతా బెనర్జీ
- అసదుద్దీన్ ఒవైసీ
- మాయావతి
- ఎం వెంకయ్యనాయుడు
- యోగి ఆదిత్యనాథ్
- అరవింద్ కేజ్రీవాల్
- రాహుల్ గాంధీ
- ప్రియాంక గాంధీ
- డాక్టర్ రమణ్ సింగ్
- అమిత్ మాల్వియా
- సిద్ధరామయ్య
- డీకే శివకుమార్
- బసవరాజ్ ఎస్ బొమ్మై
- మనీష్ సిసోడియా
- సత్యేందర్ జైన్
- సచిన్ టెండూల్కర్
- విరాట్ కోహ్లీ
- సైనా నెహ్వాల్
- సానియా మీర్జా
- రోహిత్ శర్మ
- సౌరవ్ గంగూలీ
- అభిషేక్ బచ్చన్
- అక్షయ్ కుమార్
- అలియా భట్
- దీపికా పదుకొనే
- రణవీర్ సింగ్