లోక్‌సభ ఆరో విడత పోలింగ్‌లో ఓటేసిన ప్రముఖులు

లోక్‌సభ ఆరో విడత పోలింగ్‌లో ఓటేసిన ప్రముఖులు

దేశవ్యాప్తంగా లోక్ సభ ఆరో విడత ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లో 58 స్థానాలకు  ఉదయం 7 గంటలకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 889 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆరో ఫేజ్​లో మొత్తం 11.13 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  కొంతమంది ప్రముఖులు  ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ కర్ ఆయన సతీమణితో కలిసి పోలింగ్ బూత్ దగ్గర క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేశారు. జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ, మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్, ఆప్ మినిస్టర్ అతిషి ఢిల్లీలో ఓటు వేశారు. హర్యాణ మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయాన్నే ఓటు వేయడానికి ఓటర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఉదయం ఏడు గంటలనుంచే పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి క్యూ లైన్ కట్టారు.  కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఆయన భార్యతో కలిసి మిర్జాపూర్ లో ఓటు వేశారు.

 

 ఢిల్లీలోని  7 స్థానాలల్లో  బీజేపీ, ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతున్నది. కూటమిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నది. జమ్మూ కాశ్మీర్​లోని అనంత్​నాగ్ – రాజౌరీ సెగ్మెంట్​లో మొహబూబా ముఫ్తీ పార్టీ నాయకులతో నిరసనకు దిగారు.