బారిసిటినిబ్' ఔషధానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

బారిసిటినిబ్' ఔషధానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

దేశంలో కరోనా ట్రీట్ మెంట్ రెమ్ డెసివిర్ తప్పనిసరి అయ్యింది.దీంతో రెమ్ డెసివిర్ మెడిసిన్ కు విపరీతమైన డిమాండ్ పెరిగిపోవడంతో మార్కెట్ లో దొరకడం చాలా కష్టంగా మారింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సలో రెమ్ డెసివిర్ తో పాటు ఇకపై బారిసిటినిబ్ (1 ఎంజీ, 2 ఎంజీ, 4 ఎంజీ) డాబ్లెట్లను కూడా ఉపయోగించేందుకు అత్యవసర అనుమతి మంజూరు చేసింది. దీనికి సంబంధించి సీడీఎస్ సీఏ (కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ) గ్రీన్ సిగ్నలిచ్చింది.  

నాట్కో ఫార్మా సంస్థ బారిసిటినిబ్ ఉత్పత్తిదారు కాగా, కేంద్రం నిర్ణయంతో నాట్కో ఫార్మా షేర్లు లాభాల బాటలో పరుగులు తీస్తున్నాయి. 3.35 శాతం పెరుగుదలతో రూ.926.70 వద్ద ట్రేడవుతున్నాయి. బారిసిటినిబ్ కు కేంద్రం ఓకే చెప్పడంపై నాట్కో ఫార్మా స్పందించింది. దేశవ్యాప్తంగా కరోనా చికిత్స కోసం బారిసిటినిబ్ ను సరఫరా చేస్తామని.. అందుకోసం ఈ వారం నుంచే ఉత్పత్తి చేస్తామని తెలిపింది. అయితే ఈ మెడిసిన్ ధరలను నాట్కో ఇంకా ప్రకటించలేదు.