రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు

రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు

రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు మంత్రి కేటీఆర్‌. ఢిల్లీలో జరిగిన టైమ్స్‌నౌ సదస్సులో పాల్గొన్న కేటీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రాలే కేంద్రానికి నిధులు సమకూరుస్తున్నాయన్నారు. తెలంగాణ రూ.2లక్షల72 కోట్లను పన్ను రూపంలో ఇచ్చిందన్నారు. కేంద్రం రాష్ట్రానికి తిరిగి ఇచ్చింది కేవలం రూ.లక్షా12వేల కోట్లేనన్నారు. మిషన్‌ కాకతీయ, భగీరథకు ఒక్కపైనా కేంద్రం ఇవ్వలేదన్నారు. CAAలో ముస్లింలను చేర్చకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు తమకు శత్రువులు కాదు.. కేవలం ప్రత్యర్థులేనన్నారు మంత్రి కేటీఆర్.  అంతేకాదు నోట్ల రద్దుతో నష్టం జరిగిందని ఆలస్యంగా తెలిసిందన్నారు . దేశంలో జాతీయ పార్టీలు లేవని…. అన్నీ ప్రాంతీయ పార్టీలేనని తెలిపారు కేటీఆర్ .