గేమ్స్‌ డెఫినిషన్‌పై క్లారిటీ ఇచ్చేందుకు చర్చలు షురూ

గేమ్స్‌ డెఫినిషన్‌పై క్లారిటీ ఇచ్చేందుకు చర్చలు షురూ

న్యూఢిల్లీ: ‘స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌పై ఆధారపడే గేమ్స్‌‌‌‌’, ‘అదృష్టంపై ఆధారపడే గేమ్స్‌‌‌‌’ ను డిఫైన్‌‌‌‌ చేయడానికి కేంద్ర, రాష్ట్రాలకు చెందిన జీఎస్‌‌‌‌టీ అధికారులు ఆన్‌‌‌‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీ ఎక్స్‌‌‌‌పర్టులతో కలిసి పనిచేస్తున్నారు. ఈ రెండు రకాల గేమ్స్‌‌‌‌కు ఒక క్లియర్ డెఫినిషన్‌‌‌‌ ఇస్తే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌పై ట్యాక్స్ వేయడం ఈజీగా మారుతుందని ట్యాక్స్ అధికారులు చెబుతున్నారు. ఆన్‌‌‌‌లైన్ గేమ్స్‌‌‌‌పై జీఎస్‌‌‌‌టీ వేయడంలో గత ఏడాది కాలం నుంచి చర్చలు జరుగుతున్నాయి. స్కిల్స్ అవసరముండే గేమ్స్‌‌‌‌పై తక్కువ జీఎస్‌‌‌‌టీ వేయాలని చాలా రాష్ట్రాలు జీఎస్‌‌‌‌టీ కౌన్సిల్‌‌‌‌ను కోరుతున్నాయి. అదృష్టంపై ఆధారపడే గేమ్స్‌‌‌‌తో సమానంగా ఈ గేమ్స్‌‌‌‌పై ట్యాక్స్ వేయొద్దని చెబుతున్నాయి. ఈ రెండు రకాల గేమ్స్‌‌‌‌కు సరియైన డెఫినిషన్‌‌‌‌ను తయారు చేసేందుకు  జీఎస్‌‌‌‌టీ కౌన్సిల్‌‌‌‌కు చెందిన లా కమిటీ ఆన్‌‌‌‌లైన్ గేమింగ్ ఎక్స్‌‌‌‌పర్టులతో శనివారం  బెంగళూరులో సమావేశమయ్యింది.  రాష్ట్రాల అభిప్రాయాలను కూడా తీసుకొని ఈ రిపోర్ట్‌‌‌‌ను జీఎస్‌‌‌‌టీ కౌన్సిల్ తయారు చేయనుంది. డెఫినిషన్ ఫైనలైజ్ అయ్యాక గేమ్స్‌‌‌‌పై ట్యాక్స్ ఎంత వేయాలనేది నిర్ణయిస్తారు. ప్రస్తుతం ‘అదృష్టంపై ఆధారపడే గేమ్స్‌‌‌‌’ అంటే కొన్ని రకాల గ్యాంబ్లింగ్‌‌‌‌, బెట్టింగ్ వంటి ఆన్‌‌‌‌లైన్ గేమ్స్‌‌‌‌పై 28 శాతం జీఎస్‌‌‌‌టీని విధిస్తున్నారు. స్కిల్‌‌‌‌ గేమ్స్‌‌‌‌పై 18 శాతం జీఎస్‌‌‌‌టీ వేస్తున్నారు. ఈ ట్యాక్స్‌‌‌‌లను గేమ్‌‌‌‌ల గ్రాస్‌‌‌‌ రెవెన్యూపై  విధిస్తున్నారు.