సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

ఢిల్లీ : సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం సీబీఎస్‌ఈ బోర్డు ఫలితాలను ప్రకటించింది.

బోర్డు అధికారిక వెబ్‌సైట్లు results.cbse.nic.in లేదా cbse.gov.in ద్వారా  రిజల్ట్స్ తెలుసుకోవచ్చని వెల్లడించింది. వీటితో పాటు డిజిలాకర్‌, పరీక్షా సంగమ్‌ నుంచి కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ రూల్‌ నంబర్లు, స్కూల్‌ నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు.