కిడ్నీ డ్రగ్​ జార్డియన్స్​కు ఆమోదం 

కిడ్నీ డ్రగ్​ జార్డియన్స్​కు ఆమోదం 

హైదరాబాద్​, వెలుగు: బోరింగర్​ ఇంగెల్​హీమ్​(బీఐ) కిడ్నీ వ్యాధుల కోసం తయారు చేసిన జార్జిడయన్స్​(ఎంపాగ్లిఫ్లోజిన్)కు  సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్  ఆమోదం తెలిపింది. దీర్ఘకాల కిడ్నీ వ్యాధుల కోసం ఇక నుంచి నెఫ్రాలజిస్టులు జార్డియన్స్​ 10 ఎంజీ మాత్రలను సూచించవచ్చు. నిజానికి ఈ డ్రగ్​ను ఇది వరకు టైప్​ 2 డయాబెటిస్​కు ఆమోదించారు.  

పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్‌ ఉన్న రోగులలో లేదా ఇంట్రావీనస్ ఇమ్యునోసప్రెసివ్ థెరపీ అవసరమయ్యే వారికి జార్డియన్స్​ను సిఫార్సు చేయరని బీఐ తెలిపింది. దీనిని వాడటం వల్ల ఆస్పత్రుల్లో చేరే అవసరం తప్పుతుందని, కిడ్నీ ఫెయిల్యూర్​ను ఆపవచ్చని పేర్కొంది.