తీవ్రంగా పరిగణిస్తాం.. సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

తీవ్రంగా పరిగణిస్తాం.. సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.  బాధ్యతాయుతమైన పదవి, పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపింది. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని సూచించింది. ప్రజలను  రెచ్చగొట్టేలా ప్రసంగిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.   ఇలాంటి ప్రసంగాలు రూల్స్ కు విరుద్దమన్న ఈసీ అలా మాట్లాడిన వ్యక్తుల పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం తమకు  ఉందని వెల్లడించింది.  ప్రస్తుతం దీనిని సీరియస్ గా తీసుకోవడం లేదంది ఈసీ.  

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై కత్తితో జరిగిన దాడి ఘటనపై స్పందిస్తూ సీఎం కేసీఆర్ 2023 అక్టోబర్ 30వ తేదీన బాన్సువాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద పరుషపదాలతో రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.  దీనిపై ఈసీ విచారణకు ఆదేశించింది .స్థానిక రిటర్నింగ్‌ అధికారి విచారణ చేసి ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. దీంతో ఇకపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని ఈసీ అడ్వైజరీ జారీ చేసింది.